మీకు పూషతమ్మ అద్భుతంగా చేసే వంటకం గురుంచి పరిచయం చేస్తాను -గండ్రపు సొరకాయ కూర
గండ్రపు సొరకాయ కూర
కావలిసిన వస్తువులు :-
లేత సొరకాయ -1 (250 గ్రాములు )
ఉల్లిపాయలు -1 పెద్దది
పోపు సామానులు :-
ఎండు మిరపకాలు
మినప పప్పు
జీలకర్ర
ఆవాలు
కరివేపాకు
దాల్చిన చెక్క
ధనియాలు
నువ్వులు
వైఇంచిన బియ్యం – 2 స్పూన్లు
చింతపండు
బెల్లం
వేరుశెనగ నూనె
ముందుగా సొరయకాయ తొడిమ తీసి శుభ్రం చేసి కాయ మీద గాట్లు పెట్టాలి. ఆ తరువాత సొరకాయను మద్యస్తం గా ఉండేటట్లు ముక్కలుగా కోసుకోవాలి. కొంచెం నూనెను బాణలీలో వేచి వెడ్డెక్కినా తరువాత పోపు దినుసులు వేయంచాలి .చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగిన తరువాత సొరకాయ ముక్కలని వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు ,కారం పసుపు వేసి కలియతిప్పి మూతపెట్టి సన్నటి సెగ మీద కూరలో నీరు పోయంతవరకు ఉడకనివ్వాలి. దీనికి చింతపండు గుజ్జు కూర లో కలిపి ఉడకనియ్యాలి.సొరకాయ ముక్కలు వుడికినతరువాత రుచికి సరిపడా బెల్లం చేర్చాలి .
చివరిగా పొడిచేసుకున్న దాల్చిన చెక్క,ధనియాలు,బియ్యం మరియు నువ్వుల పొడిని కూరలో కలిపి ఒక నిముషం తరువాత స్టవ్ నుంచి దించి కూరగిన్నలోకి మార్చుకొని కూర పైన తరిగిన కొత్తిమీర జల్లుకోవాలి. ఈ గండ్రపు సొరకాయ కూర వేడి,వేడి అన్నం లో తింటే ఏంతో రుచికరంగా ఉంటుంది .
Avakaya: