Hello Familia! Hope below information helps our family members who are interested in conducting the events as per our traditions.
Barasala/Cradle ceremony:
బారసాల
బాలసార నవజాత శిశువుకు మొట్ట మొదటిసారిగాజరిపే వేడుక.బారసాలను క్రీ .పూ 2000 సంవత్సరం లోఆది సంకరాచార్యలు వారు ప్రారంభించినారు. బాలసారఅనగా నవజాత శిశువుని మొదటి సారిగా ఊయలలోవేసే కార్యక్రమాన్ని బారసాల అంటారు .దీన్నినామకరణడోలారోహణ లేదా నామకరణం అని కూడాపిలుస్తూవుంటారు.ఆచార పద్దతిలో బాలసారె గా కూడావ్యవహరిస్తారు.ఈ వేడుకను ఎక్కువగా శిశువు జన్మిచినఇరవైఒకటోరోజు చేస్తారు.దీన్నిపదకొండవరోజు నుండిఇరవైఏడో రోజువరకు బేసి సంఖ్య వచ్చే రోజూ ఎప్పుడైనాచేసుకో వచ్చు.
బారసాలను అమ్మాయి పుట్టింటి వారు చేస్తారు. ఈవేడుకకు బంధు మిత్రులను ,అమ్మాయి అత్తింటితరుపు వారినీ ఆహ్వానిస్తారు . పిల్లవానిని ఉయ్యాల్లాలోవేచే రోజూ సాయంత్రం శిశువుని ఊయల్లో మెత్తని పరుపువేసి నలుగు మూలాల తాంబూలం ఉంచుతారు .నానబెట్టిన సెనగలు కూడా తాంబూలం పైన పెడతారు.పుట్టింటివారు నగ అలాగే కూతురుకు అల్లుడుకు బట్టలుపెడతారు.ఒక కొబ్బరికాయను శిశువు చుట్టూ తిప్పి దృష్టిదోషం తొలగడం కోసం కొబ్బరికాయను కొడతారు.తాతయ్యఅమ్మలు అక్షింతలు వేసి శిశువుని వాని తల్లి తండ్రులనుదీవిస్తారు .తరువాత వచ్చిన ముత్తైదవలు ఆశీర్వదిస్తారు.బిడ్డకు చివరిగా హారతి ఇచ్చి బందు మిత్రులకు అతిధిసత్కారాలు చేస్తారు .
Cradle ceremony can be organized on 21st day of baby’s birth.This is performed by maternal grandparents.On the day of ceremony Tambulam is placed on the 4 sides of cradle matress. Soaked chikpea/channa is placed on top of tambulam. Maternal grandparents gift jewelry to baby ,Clothes to parents. Once baby is placed in the cradle everyone blesses baby with akshantas. Then Break the coconut to remove dristi.Finally ceremony can be ended by giving managala harati to baby.
Purudu/Post delivery Bath:
మానవుని జీవిత చక్రంలో పుట్టినప్పటినుంచి పెళ్లివరకువివిధ రకాలైనటువంటి వేడుకలు బంధు మిత్రులసమక్షంలో జరుపుకుంటుంటారు.వీటిలో ముఖ్యమైనవిపురుడు,బారసాల,అన్నప్రాసన, అక్షరాభ్యాసం మరియునూతన వస్త్ర బహుకరణలు & పరిణయం, ఆ ఆ ప్రాతంలారీతి రివాజుల ప్రకారం జరుపుకుంటారు. ఈ వేడుకలు సందర్భానుసారంగా ఏ వయసులో జరగవలిసినవేడుకలను ఆ వయసులో జరుపుతారు. వీటినిజరుపుకునే ఆచార వ్యవహారాలను చర్చింకుందాము.
పురుడు శ్రిష్టిలో ప్రతి స్త్రీకి అత్యన్త ఆనందదాయకం తాను మాతృమూర్తి కావటం .ఏ ఇంట్లోనైనా శిశువుకు జన్మనిచ్చేసమయం లో పాటించే ఆచారమే పురుడు. మొదటి కాన్పుసహజంగా పుట్టినింట జరిపిస్తారు.
పురిటి మైల
అనాది నుండి పురుడు వస్తే మైల పాటించటం(అచౌసం ) ఆచారం గా పాటిస్తుంటారు. దీనికిశాస్త్రీయం కారణం గా కూడా చెప్పుకోవచ్చు. శిశివుకు జన్మనిచ్చే క్రమంలో తల్లి గర్భం నుండి కొన్ని వ్యర్ధమాలిన పదార్ధాలు వెలుబతాయి.ఈ వ్యర్ధాలుసూక్ష్మక్రిములు (వైరస్ ) ఉండుటవలన మరియు ఈసూక్ష్మక్రిముల జీవన ప్రమాణం పది రోజులు ఉంటుందికాబట్టి పదకొండవ రోజు పురిటి స్నానంచేయిస్తారు.ఇంటిని ,ఇంట్లో వస్తువులను పసుపు నీటితొశుద్ధి చేసి మైల తీరిందంటారు.మైల వున్నన్ని రోజులుఇంట్లో పూజ అర్చన దీపారాధనలు చేయరాదు
పురుటి స్నానం
ప్రసవించిన పదకొండవ రోజు పురిటి స్నానం చేయిస్తారు .స్నానానికి ముందుగా అమ్మాయిని పీట మీదకూర్చొనిబెట్టి ,చేతిలో తాంబూలం పండు ఇచ్చి, పీటకునాలుగువైపులా పసుపుని చిన్న ముద్దలాగా చేసిఉంచుతారు .నువ్వుల నూనెతో నలుగు పెట్టి వేడినీటితో ( పసుపు మరియు వేపాకు కలిపి కాసిన నీళ్లు ) స్నానంచేయిస్తారు .సహజ సిద్ధంగా కాన్పు జరిగినట్లయితేపొట్టమీదకు చిన్న గిన్నెతో విసిరి పోయుదురు.శిశివుకుకూడా వెన్న ,కొబ్బరినూనె,నువ్వుల నూనె లేదా నెయ్యి తోటినలుగుపెట్టి స్నానం చేయిస్తారు. అనంతరం సాంబ్రాణిపొగ పట్టిస్తారు.
మెట్టినింటివారు తెచ్చిన కొత్త బట్టలు ధరింప చేయిస్తారు.దీపారాధన చేసి దేవునికి నీవేయిద్యం సమర్పిస్తారు .
శిశివుని తూరుపు దిశగా చేట లో తెల్లటి చీర (పాతది) వేసిపండుకొ పెడతారు.శిశువుకు రెండు వైపులా తాంబూలంఉంచుతారు.ఒక కుక్కకి వేపాకులతో కట్టిన దండనుమేడలో కట్టి ,బొట్టు పెట్టి విస్తరాకులో తినుటకు అన్నం,పప్పు ,కూరలు వగైరాలు పెడతారు .
వారి వారి ఆహార పద్దతులను అనుసరించి మాంసాహారంలేదా శాకాహారం తో బందువులకు భోజనాలుపెడతారు.వియ్యంకుడు వియ్యపురాళ్లు ఆడబిడ్డలుమున్నగు వారికీ సంతషంతో బట్టలు పెడతారు.
On the 11th day of baby’s birth Mother is giving post delivery bath. The procedure of bath is as follows. She is made to sit on stool and given tambulam. Turmeric balls are placed on 4 sides of stool. Seaseme oil and scrub is applied to mother.She is given bath with hot water(Turmeric and neem leaves can be mixed in this hot water).
Along with mother Baby is given bath(If the cord comes off) by applying Sesame oil/ghee/coconut oil and scrubbed.Then baby is given samreni smoke to dry. Then mother wears the saree given by her inlaws and offers prayers.
Baby is made to lay down on small winnowing basket(Chaata) facing east. Tambulam is placed on both sides of basket.
Optional-Lunch for relatives and friends can be sponsored by maternal grandparents. Clothes can be given to girls in-laws.
Optional-As per tradition on this day a dog is garlanded with neem leaves and offered food.
పత్యం :-
తేలికగా జీర్ణం అయ్యే ఆహారంతీసుకొనాలి.వంకాయ గోంగూర మరియు ఆకుకూరలు (దురద పుట్టెంచేవి ) రెండు నెలల వరకుతినరాదు.జున్ను కూడా ఆరు నెలల వరకుతినరాదు.బాలింతకు పాలు పడుటకు రోజూ రాత్రి పూటపాలు కలిపిన అన్నం పెట్టవలెను.
Brinjal/Gongura,Buffalows collustrum milk can be avoided by mother.
Easily digested food like Bottle gaurd,greens,meat,milk,methi is given to mother.
NUTANA VASTRA BAHUKARANA/Half saree dhoti ceremony:
నూతన వస్త్ర బహుకరణ
నూతన వస్త్ర బహుకరణ అనే వేడుక బాల్యం నుండి యుక్త వయసులో ప్రవేశిస్తున్న బాలురు మరియు బాలికలకు బంధు మిత్రుల సమక్షం లో నూతన పట్టు వస్త్రాలు ధరింపజేసే వేడుకని నూతన వస్త్ర బహుకరణ అంటారు .ఈ వేడుకను దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రలో వేడుకకాఁగా చేసుకుంటారు .దీనిని అమ్మమ్మ తాతయ్యలు లేదా అమ్మ పుట్టింటి వైపువారు శక్తికొద్దీ ఘనంగా జరిపిస్తారు.మగ పిల్లవానికి 11 లేదా 15 సంవస్సర వయసులోనూ అదే బాలికలకు 9 లేదా 11 సంవస్సరాల వయసులో జరిపిస్తారు. ఈ వేడుకను జరిపింసుకొనుటకు బాలుడు లేదా బాలిక జన్మ నక్షత్రం ప్రకారం శుభలగ్నం నిర్ణయయించి బంధు మిత్రులకు ఆహ్వాన లేఖలు పంపటము మరియు స్త్రీ లకు బొట్టు పెట్టి ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు.ఆడపిల్లలకు ముందు రోజు గోరింటాకు చేతులకు కాళ్ళకు పెట్టి అలంకరిస్తారు.
ఆరోజు ఉదయం మంగళ స్నానాలు చేయించి నూతన వస్త్రాలు ధరింపజేసి విగ్నేశ్వర పూజ చేయిస్తారు.పాయసం మరియు పిండివంటలు దేవునికి నైవేద్యం సమర్పిస్తారు.తదనంతరం పట్టువస్త్రాలను అమ్మమ్మ తాతయ్యలు బహుకరిస్తారు.
బాలికలకయితే ,అమ్మమ్మ తాతయ్యలు పట్టు లంగా ఓణీ బహుకరించిన తరువాత తెల్లచీర పెడతాం సంప్రదాయం .ఇవి ధరింపచేసి ఆశీర్వాదం తీసుకున్నతరువాత పట్టుచీర కట్టబెట్టి వేదిక పై కుర్చోపెడతారు.
సంప్రదాయంగా బాలికకు పట్టు పరికిణి,ఓని ను బాలురకు పట్టు పంచ ,పైపంచ మరియు జబ్బా ను బహుకరిస్తారు.నిర్ణయించిన ముహూర్తానికి నూతన వస్త్రాలు ధరిస్తున్న వారి మేనత్త నుకూడా వేదికపైన కూర్చోబెడతారు . బంధు మిత్రుల సమక్షములో పట్టు వస్త్ర ధారణ ధరింప సేయిస్తారు.పట్టువస్త్రాలతో పాటు బంగారు నగకూడ బహుకరిస్తారు.నూతన వస్త్రాలు ధరించే వారి చేత ఐదుగురు ముత్తైదులకు తాంబూలం ఇప్పిస్తారు.నూతన వస్త్రధారణ అనంతరం అతిధులు అక్షింతలువేసి ఆసిర్వదిస్తారు. తదనంతరం విందు భోజనం తో అతిధి సత్కారాలు చేస్తారు. ఈ వేడుకను జరిపించుటలో ముఖ్య కారణం, తమ పిల్లలు యుక్త వయసులో ప్రవేశిస్తున్నారని బంధు మిత్రులకు మరియు సమాజాన్ని తెలియపర్చటం పూర్వకాలంనుంచి కొనసాగుతున్న సదాచారం.
Half saree/dhoti ceremony is organized when girl/boy reach any of the below given ages Girl-9 yrs/11 yrs. Boy-11yrs/15 yrs.
Based on Birth star a muhurtam is decided.For girls on the day prior to the ceremony henna is applied.
On the day of ceremony Managla snanam is performed. Then Girl or boy are given new clothes and prayers offered to god.Then Maternal grandparents offer half saree/dhoti as well as jewelry to girl/boy.
For girl before she wears half saree she is made to wear white saree given by maternal grandparents and receives blessings.
Once Girl/boy change into half saree/dhoti during the muhurtam they are made to sit along with their aunt(Father’s sister).The boy/girl will receive blessings from relatives and friends followed by lunch/dinner.